గుదిబండలా చంద్రబాబు పాలన
సంక్షేమం లేదు... అభివృద్ధి కానరాదు పంటలకు గిట్టుబాటు ధర శూన్యం ఉపాధి కల్పనలోనూ కోతలే సంక్రాంతి సంబరాలెలా చేసుకుంటాం? పావులూరు రచ్చబండలో జనం మాట
రైతుకు వెన్నుపోటు
చిన్నగంజాం: నమ్మి ఓట్లేస్తే...చంద్రబాబు పాలన అన్నివర్గాల ప్రజలకు గుదిబండలా మారిందని జనం లబోదిబోమంటున్నారు. మంగళవారం పర్చూరు నియోజకవర్గం, ఇంకొల్లు మండలం, పావులూరు ప్రధాన కూడలి ప్రాంతంలోని రచ్చబండ వద్ద గ్రామస్తులను ‘సాక్షి’ పలకరించింది. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ప్రజలు అన్నారు. సంక్షేమ పథకాల్లో కోత పెట్టారని, అభివృద్ధి పనుల జాడే లేదన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించినా గిట్టుబాటు ధర దక్కడం లేదని వాపోయారు. పేదల ఉపాధి పనుల్లోనూ కోత పెట్టారన్నారు. మొత్తంగా చంద్రబాబు పాలనలో అష్టకష్టాలు పడుతున్నామని పావులూరు రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అందరి కడుపు నిండేదని మాట్లాడుకోవడం కనిపించింది. వారిలో ఎక్కువ మంది రైతులు తమ బాధలను అందరి ముందు వ్యక్తపరుస్తూ వారి చర్చలను కొనసాగించారు. పండగ సమయంలో ఎంతో సంతోషంగా గడపాల్సి ఉండగా... ఎవరినోట చూసినా బాధలు, ఆవేదనలతో వచ్చే మాటలే వినిపించాయి.
సాగుకు కష్టకాలమే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయం కుంటుపడింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదు. కనీసం కొనుగోలు చేసే నాథుడే లేడంటూ గాదె వెంకటేశ్వరరెడ్డి అవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఐదేండ్ల పాలనలో పంటలు బాగా పండాయి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించింది, రైతులంతా సుభిక్షంగా ఉన్నామంటూ చిడిపూడి శ్రీనివాసరెడ్డి, హనుమంతరెడ్డిలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినప్పటికీ దాదాపు మూడేళ్లపాటు వరుసగా పండించిన పంటలు చక్కగా అమ్మకాలు జరిగాయన్నారు. తమలాంటి రైతులకు ఇబ్బంది కలిగిన పరిస్థితిలో ప్రభుత్వం నేరుగా గిట్టుబాటు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేసిందనానరు. రైతులకు ఎటువంటి కష్టం లేకుండా చేశారంటూ పులఖండం జయరామిరెడ్డి చెప్పారు.
అండగా నిలిచి...
‘జగన్ అధికారంలో లేకపోయినా మాలాంటి పొగాకు రైతులకోసం మద్దతు ప్రకటించేందుకు మా ప్రాంతానికి వచ్చారు. ఽమాకు అండగా నిలిచారు. అప్పుడే కొనుగోలు ప్రారంభించారు. అది కూడా టీడీపీకి చెందిన రైతుల వద్ద మాత్రమే పొగాకు కొనుగోలు చేసి ఇతరులను ఇబ్బందులకు గురిచేశారు. ప్రస్తుతం పొగాకును అటు అమ్ముకోలేక...ఇటు కాపాడుకోలేక పోతున్నాం’ అని ముప్పవరపు శ్రీరాములు, పవన్‌కుమార్ రెడ్డిలు ఆవేదన వ్యక్తపరిచారు. శనగకు గిట్టుబాటు ధర లేక, కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ పులఖండం పుల్లారెడ్డి తదితరులు తమ ఆవేదనను నలుగురి ముందు వ్యక్తపరిచారు. వీరితోపాటు పలువురు స్థానిక గ్రామస్తులు రచ్చబండ వద్ద తమ బాధలను బహిరంగంగా చర్చించుకోవడం కనిపించింది. వారి చర్చల్లో ఆరోగ్య శ్రీ , ఫీజు రీయంబర్స్‌మెంట్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆడబిడ్డ నిధి వంటి పలు అంశాలను చర్చించి చంద్రబాబు సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం రైతుకు వెన్నుపోటు పొడిచింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మిర్చి క్వింటా ధర రూ. 27 వేల నుంచి రూ. 30 వేలు వరకు ఉంది. ప్రస్తుతం క్వింటా రూ. 10 వేల నుంచి రూ. 12 వేలు మాత్రమే ఉంది. శనగలు గత ప్రభుత్వంలో క్వింటా రూ.10 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 4,800లు మాత్రమే పలుకుతోంది. పొగాకు రూ. 18 వేలు ఉంటే ప్రస్తుతం రూ. 3 వేలు, రూ. 6 వేలు మాత్రమే ఉంది. మొక్కజొన్న గతంలో రూ. 3 వేలు ఉండగా... ఈ ప్రభుత్వంలో రూ. 1000, రూ. 1,500 మాత్రమే ఉంది. శనగలు గోదాముల్లో పడి మూలుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేయకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పంట స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు అనుకూలంగా పాలన సాగించారు.
– పులఖండం జయరామిరెడ్డి, రైతు,
పావులూరు, ఇంకొల్లు మండలం
గుదిబండలా చంద్రబాబు పాలన
గుదిబండలా చంద్రబాబు పాలన


