సందడిగా సంక్రాంతి సంబరాలు
ఆకట్టుకున్న మహిళా పోలీసుల రంగవల్లులు సంక్రాంతి సంబరాల్లో కుటుంబసమేతంగా ఎస్పీ
బాపట్ల టౌన్: తెలుగువారి అతిపెద్ద పండుగ, సంస్కృతికి ప్రతీకై న సంక్రాంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో పోలీస్ పరేడ్ మైదానంలో ‘సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నిత్యం శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల దర్యాప్తులో తలమునకలయ్యే పోలీస్ అధికారులు, సిబ్బంది, సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎడ్లబళ్లు, రంగవల్లులు, డూడూబసవన్నల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, మహిళల కోలాటం, చిన్నారుల భరతనాట్యం ప్రదర్శన కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. సంబరాల్లో భాగంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ పోటీలు అత్యంత ఉత్కంఠగా సాగాయి. పెయింటింగ్, మ్యూజికల్ చైర్స్ పోటీలు ఆహ్లాదకరంగా సాగాయి. ఎస్పీ స్వయంగా దగ్గరుండి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడల అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.
సందడిగా సంక్రాంతి సంబరాలు


