ప్రాణాలు వదులుతా..
● మేరుగ నాగార్జున మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహనరెడ్డి అంటే ఒక నిబద్ధత, నమ్మకం అని అన్నారు. నియోజకవర్గంలో సాయుధ సైనికుల్లాంటి కార్యకర్తలు ఉన్నారని, ఎవరూ అధైర్య పడొద్దన్నారు.
● పర్చూరులో పార్టీ గెలుపు ముఖ్యమని, అందుకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వేసిన కమిటీలకు నేరుగా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో సంబంధాలుంటాయని, నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటించాలని ఆయన కార్యకర్తలకు, నాయకులకు సూచించారు.
● జిల్లా టాస్క్ ఫోర్స్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అంటే ప్రాణత్యాగం చేసే కార్యకర్తలున్నారని, అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడాలన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి నాయకుడు, కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు.
● గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టని ఎన్నో పనులను సైతం వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రవేశ పెట్టి అమలు చేశారన్నారు. జగన్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సరైన స్థానం దక్కుతుందన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ సచివాలయ వ్యవస్థ ఒక్క జగన్ వల్లే సాధ్యమైందన్నారు.
● పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కార్యకర్తలందరూ ఏక తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేసి పర్చూరు నియోజకవర్గంలో విజయం సాధించి పార్టీని అధికారంలోకి తీసకురావాలన్నారు.
● వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనలో తేడాలున్నాయని, వాటిని ప్రజలకు నాయకులు, కార్యకర్తలు వివరించాలని కోరారు. పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు మంజూరు చేసి పార్టీ అధికారంలోకి వచ్చాక వారికి సముచిత స్థానం కల్పించి గౌరవం దక్కేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
వైఎస్సార్ సీపీ జెండా చేత పట్టుకునే
పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున
పర్చూరు (చినగంజాం): తాను చనిపోవాల్సి వస్తే వైఎస్సార్ సీపీ జెండా చేత పట్టుకొని తన ప్రాణాలు వదులుతానే తప్ప పార్టీని వదలి పెట్టి వెళ్లేది లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పర్చూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నియోజక వర్గ కార్యకర్తల విస్తృత సమావేశానికి ఇన్‌చార్జి గాదె మధుసూదన్‌రెడ్డి అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాంబాబు. రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి మాచవరపు రవికుమార్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లాటి ఏడుకొండలు, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, పార్టీ మండల కన్వీనర్‌లు కఠారి అప్పారావు, జువ్వా శివరాం ప్రసాద్, జంపని వీరయ్య చౌదరి, మున్నం నాగేశ్వరరెడ్డి, చిన్ని పూర్ణారావు పఠాన్ కాలేషావలి, నాయకులు పి.రామకృష్ణారెడ్డి, మొగిలి నాగేశ్వరరావు, కొండూరి గోవింద్, జంగా వంశీ, యూ.అనిల్ చౌదరి, కాటుకూరి బాబూరావు, నూర్ అహ్మద్, జి.రవిచందర్, దాసరి వెంకట్రావు, కోట శ్రీనివాసరావు, వై.హరిప్రసాద్, కె.రమేష్, కొల్లా శేషగిరి పాల్గొన్నారు.