క్రీడల్లో బాపట్ల జిల్లాకు ప్రాధాన్యం పెరగాలి
బాపట్ల: రాష్ట్ర స్థాయిలో ఒలంపిక్ గేమ్స్‌లో సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ ప్రత్యేక అవసరాల గల విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన ఎ.భార్గవ్ శ్రీరామ్, ఎం.రత్న కుమార్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం లో మొదటి, మూడవ స్థానంలో విజేతలుగా నిలిచారు. రేపల్లె మండలం, ప్రభుత్వ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి ఎస్.కె.అహ్మద్ జోనల్ లెవెల్‌లో బాపట్ల జిల్లా నుంచి ఎంపికై న విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు క్రీడల్లో ప్రాధాన్యం పెరగాలని ఆకాంక్షించారు.
కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్


