రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ విజేత బాపట్ల
మార్టూరు: గత మూడు రోజులుగా మార్టూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో బాపట్ల జిల్లా విద్యార్థులు విజేతలుగా నిలిచారు. స్థానిక వివేకానంద నెక్స్‌ట్ జెన్ పాఠశాలలో నిర్వహించిన అండర్–19 విభాగంలో 13 జిల్లాల బాల బాలికలు పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగిన పోరులో బాలుర విభాగంలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానం, అనకాపల్లి జిల్లా ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా విద్యార్థులు తృతీయ స్థానం కై వసం చేసుకున్నారు. బాలికల విభాగంలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానం, అనకాపల్లి జిల్లా ద్వితీయ స్థానం, సత్యసాయి జిల్లా బాలికలు తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. విజేతలకు జరుగుల లక్ష్మీనారాయణ, పెంటేల శరత్ బాబు, మాదాల సాంబశివరావు, పొత్తూరి శివరావు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో షూటింగ్ బాల్ రాష్ట్ర చైర్మన్ ఆర్డీ ప్రసాద్, కార్యదర్శి కె.జె. జోసెఫ్, ఆర్గనైజర్ ఎం.రత్నకుమార్, ఎం.కిషోర్ బాబు, పూల ప్రసాద్, బాపట్ల జిల్లా కార్యదర్శి పిల్లి సురేంద్ర, క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు.


