బ్రిటీష్ పాలకులను ఎదిరించిన ఓబన్న
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: పంటలు పండని సమయంలో పన్నులు చెల్లించాలని ప్రజలపై దౌర్జన్యం చేస్తున్న బ్రిటీష్ పాలకులను ఎదిరించిన నాయకుడు వడ్డే ఓబన్న అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆదివారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ డీఆర్వో జి గంగాధర్‌గౌడ్, బీసీ సంక్షేమ శాఖ డీడీ శివలీల, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ అంజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలసి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన విలువలు, సూచనలు నేటితరం నాయకులు యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.


