చందుకు ‘ప్రైడ్ ఆఫ్ భారతరత్న’ పురస్కారం
మార్టూరు: అమ్మ అనాథ ఆశ్రమం స్థాపించి వృద్ధులు, అనాథలకు సేవలు అందిస్తున్న మార్టూరుకు చెందిన గుంటుపల్లి చందు ఆదివారం హైదరాబాదులో అరుదైన పురస్కారం అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదు రవీంద్రభారతిలో ఆదివారం సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా ఆశ్రమ నిర్వాహాకుడు చందుకు ప్రైడ్ ఆఫ్ భారతరత్న అవార్డును పార్లమెంట్ మాజీ సభ్యుడు సముద్రాల వేణుగోపాల చారి, తెలంగాణ ఫిలింనగర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, దైవజ్ఞశర్మ, వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస రాజు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహాకుడు చందును మార్టూరుకు చెందిన పలువురు అభినందించారు.


