సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ ప్రయాణికుల సౌకర్యార్ధం సంక్రాంతి పండుగ సందర్భంగా అనాకాపల్లి–చర్లపల్లి–అనకాపల్లి ప్రత్యేక రైళ్లను కేటాయించడం జరిగిందని పీఆర్‌ఓ వినయ్‌కాంత్ ఆదివారం తెలిపారు. రైలు నంబర్ 07479 అనకాపల్లి–చర్లపల్లి రైలు ఈనెల 18వ తేదీన కేటాయించడం జరిగిందని రాత్రి 10.30 గంటలకు అనకాపల్లి స్టేషన్ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 07477 చర్లపల్లి–అనకాపల్లి రైలు ఈనెల 19న మధ్యాహ్నం 12.40 గంటలకు బయలు దేరి అదే రోజు రాత్రి 9 గంటలకు అనకాపల్లి స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. రైలు నంబర్ 07478 అనకాపల్లి – చర్లపల్లి రైలు ఈనెల 19వ తేదీన రాత్రి 10.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు.
గుంటూరు రూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలమేరకు బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన తనిఖీలలో భాగంగా బియ్యం అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల బియ్యాన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నల్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏటుకూరు గ్రామంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద నెంబర్ లేని టాటా ఏస్ వాహనంలో పీడీఎస్ రైస్ బ్యాగులు నింపి పార్క్ చేసి ఉన్నట్లు సమాచారం మేరకు దాడిచేసి అందులోని మొత్తం 2.5 టన్నులు (50 కేజీలవి, 50 బస్తాలు) బియ్యం స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం వాహనాన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడీపేట 5/18 లైన్ వద్ద పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరుగుతుందని టాస్క్‌ఫోర్స్ బృందానికి అందిన సమాచారం మేరకు దాడిచేసి వాహనాన్ని, వాహన డ్రైవర్ పాలేటి నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.
హోరాహోరీగా రాష్ట్ర స్థాయి పోటీలు
కారంచేడు: మండల కేంద్రమైన కారంచేడు దగ్గుబాటి రామానాయుడు ఇండోర్ స్టేడియంలో ఆదివారం రాష్ట్ర స్థాయి డబుల్ షటిల్ బాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ముందుగా ప్రకటించిన రీతిలోనే ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు చెందిన 60 టీంలు ఇందులో నమోదు చేసుకున్నారు. ఉదయం నుంచి నిర్వహించిన ఈ పోటీల్లో టీంలుగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. బాడ్మింటన్ కమిటీ, ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ, నాలుగో స్థానాల్లో విజయం సాధించిన టీంలతో పాటు, ఒక ప్రత్యేక బహుమతిని కూడా అందించనున్నామని నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగానే ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. క్రీడలను ప్రోత్సహించడంతో పాటు, యువతలో ఆటల పోటీల పట్ల చైతన్యం కల్పించేందుకే ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు.
కోడి పందేల నిర్వాహకుల అరెస్టు


