అన్నింటా దైవత్వాన్ని చూడాలి
బాపట్ల : అన్నింటా దైవత్వాన్ని చూడాలని తిరుపతి మాతాజీ రమ్యానందభారతి పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ జిల్లెళ్లమూడి సంయుక్త ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ శిల్పశాల సదస్సు శనివారం జిల్లెళ్లమూడిలో నిర్వహించారు. సదస్సును శ్రీ శక్తి పీఠాధిస్వరి తిరుపతి మాతాజీ రమ్యానంద భారతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అదే మొదటి మెట్టు పెద్దవారు చెప్పేది చెబుతారు కానీ మనం చేయాల్సింది చేయాలన్నారు. సభా ప్రారంభకులు విశ్వజరణి పరిషత్ ట్రస్ట్ పూర్వ అధ్యక్షులు, ఆర్థిక శాస్త్ర నిపుణులు కె నరసింహమూర్తి మాట్లాడుతూ ఎన్నో నాగరికతలు నశించాయి కానీ మన సనాతన ధర్మం మిగిలిందని గుర్తు చేశారు. లోక మంతా బాగుండాలని కోరుకునే మన ధర్మమే గొప్పదని, ధర్మాన్ని నిలపడడానికే అమ్మవారు ఇక్కడికి వచ్చారని, అమ్మ తత్వం సమాజానికి ప్రపంచానికి అవసరమన్నారు. ఉలిదెబ్బలు తగిలితేనే శిలకు శిల్పంగా రూపం వస్తుందని అమ్మ చెప్పారని చెప్పారు. సభాధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసరావు ప్రసంగిస్తూ రమ్యానంద భారతి రావటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో గోరంట వెంకయ్య, సూక్తి సుధాకర్, డాక్టర్ అన్నదానం చిదంబర శాస్రి, వల్లూరి ప్రేమ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి మాతాజీ రమ్యానందభారతి


