వేడుకగా సంక్రాంతి సంబరాలు
హరిదాసుగా విద్యార్థి..
రేపల్లె: సంస్కృతి, సాంప్రదాయాలను చిన్న వయస్సు నుంచే తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని మోంట్ స్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ కిరణ్‌కుమార్ అన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా పట్టణంలోని మోంట్‌ఫోర్ట్ స్కూలులో శనివారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశంలో అనేక పండుగలు ఉన్నాయని, ప్రతి పండుగ విశిష్టతను విద్యార్థి దశ నుంచే తెలుసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులు, వారి తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమాల్లో భాగంగా వేసిన భోగి మంటలు, భోగి పళ్ల వేడుక కనులపండువుగా సాగింది. వైస్ ప్రిన్సిపల్ ప్రదీప్‌రెడ్డి, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.
కర్లపాలెం: కర్లపాలెం శ్రీ భార్గవి హైస్కూల్‌లో సంక్రాంతి సంబరాలు వేడుకగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా శనివారం విద్యార్థులు పాఠశాల ఆవరణలో రంగవల్లులు వేశారు. పొంగళ్లు చేసి భోగి మంటలు వేసి సందడి చేశారు. విద్యార్థులు పలు వేషధారణలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలతో పండుగ సందడి నెలకొంది. విద్యార్థులు హరిదాసుల వేషధారణలో పండుగ గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, హైస్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు.
వేడుకగా సంక్రాంతి సంబరాలు
వేడుకగా సంక్రాంతి సంబరాలు


