ఘనంగా రామనామ క్షేత్రంలో పూర్ణాహుతి
అద్దేపల్లి(భట్టిప్రోలు): అద్దేపల్లి శ్రీరామనామ క్షేత్రం 75వ వజ్రోత్సవ వేడుకల శ్రీరామ యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదేశ స్వామి, దాసశేష స్వామి వార్ల గురుపరంపర పీఠం సష్ట పీఠాధిపతులు కార్యక్రమాలను వైభవంగా జరిపారు. శ్రీ సీతారామదాస స్వామి(దాసకుటి–అంగలకుదురు) పర్యవేక్షణలో పలు వేడుకలు జరిగాయి. ఉదయం 8 గంటలకు జరిగిన శ్రీరామ యజ్ఞం కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. ఉదయం శ్రీ కోదండరామ స్వామికి సహస్రనామ పూజ, శ్రీరామ సప్తాక్షర జపమును కమిటీ సభ్యులు భక్తులతో జరిపించారు. క్రోసూరి మురళీ కృష్ణమాచార్యుల బృందం స్వామి వారికి ప్రధాన పూజలు, అలంకరణ నిర్వహించారు. రామనామ క్షేత్రం ఆవరణలో శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం(తెనాలి) ఆర్గనైజర్ ఎ.వెంకట లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఘనంగా రామనామ క్షేత్రంలో పూర్ణాహుతి


