40 ఎకరాలు విక్రయం
అధికార పార్టీ ప్రజా ప్రతినిధి అండదండలతో ఒంగోలుకు చెందిన ఓ వ్యాపార వేత్తకు 40 ఎకరాలకు భూమిని ఎకరం రూ. 4 లక్షలు చొప్పున అమ్మినట్లు, సదరు వ్యాపారి తను కొనుగోలు చేసిన భూమిలో జేసీబీ వంటి భారీ యంత్రాలను ఉపయోగించి వ్యాపారి రాత్రి వేళల్లో పనులు నిర్వహిస్తుండటంతో రెవెన్యూ అధికారులు అభ్యంతర పెట్టినట్లు సమాచారం. మరికొందరు వ్యక్తులకు చిల్లరగా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నట్లు నష్టపోయిన స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. అదే భూమిలో ప్రాంతాన్ని బట్టి ఎకరం రూ. 7 లక్షల వరకు బేరం పెట్టినట్లు సమాచారం. మడ అడవులను నిర్దాక్షిణ్యంగా నరికి వేస్తూ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. గత నెల డిసెంబరులో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌ను స్థానికులు కలిసి అర్జీని సమర్పించినప్పటికీ చర్యలు తీసుకోక పోవడం గమనార్హం. దీనికి సంబంధించి వివరణ కోసం తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావును సంప్రదించగా ఆ విషయం తమ దృష్టికి ఇంకా రాలేదన్నారు. పరిశీలన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.


