26న రాజ్యాంగ పరిరక్షణ సభ
పొన్నూరు: ఈ నెల 26వ తేదీన పొన్నూరు పట్టణంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహించనున్నట్లు మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకటరావు తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో సభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పొన్నూరు, నిడుబ్రోలులో సామాజిక సంఘర్షణలు తలెత్తకుండా సామరస్యం కోసం కృషి చేసిన వారికి స్వర్ణపురి సంఘమిత్ర పురస్కారం ప్రదానం చేయనున్నట్లు జైభీం సమూహం కార్యనిర్వాహక వర్గం తెలిపారు. మాల మహానాడు, మాల మహాసభ, ఇతర ప్రజా సంఘాలు సంయుక్తంగా 26న సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్న సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎద్దు రత్నరాజు, రెమెళ్ల వెంకట్రావు, యడ్ల వందనం, జంగా రాజేష్, చల్లపల్లి ఆనంద్, కంచర్ల సుధాకర్, గుమ్మడి రోశయ్య, గిరిబాబు, శ్యామ్ ప్రసాద్, దూళ్ల జంగం తదితరులు పాల్గొన్నారు.


