జాతీయస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
కొల్లూరు: జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్ బాల్ పోటీలకు శ్రీరామ సైనిక్ స్కూల్ విద్యార్థులు 12 మంది ఎంపికై నట్లు శ్రీరామ రూరల్ విద్యా సంస్థల డైరెక్టర్ కొలసాని తులసి విష్ణుప్రసాద్ సోమవారం తెలిపారు. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో నిర్వహించనున్న 2వ జాతీయ బాలుర, బాలికల స్పీడ్ హ్యాండ్ బాల్ పోటీలలో తమ పాఠశాల నుంచి ఎంపికై న క్రీడాకారులు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యా సంస్థల ఆవరణలో నిర్వహించిన క్రీడాకారల ఎంపిక ప్రక్రియలో విద్యార్థులు, కె.హేమంత్, యు.జస్వంత్, ఎం.యోగ రాజశేఖరరెడ్డి, ఎస్.శివగోపి, పి.సుమంత్, యు.జిష్ణునాథ్, ఆర్.సుదర్శన్, ఇ.ఆదిశేషు, ఎం.ఈశ్వర్ మణికంఠ, ఎస్.హేమంత్, జి.ప్రభు, ఎ.జస్వంత్‌లు ఎంపికై నట్లు తెలిపారు. రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులను స్పీడ్ హ్యాండ్ బాల్ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి వణకూరి గోపికృష్ణ, శ్రీరామ సైనిక్ స్కూల్ డైరెక్టర్ కె.శ్రీకాంత్, విద్యా సంస్థల అధ్యక్షుడు తులసి విష్ణుప్రసాద్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.


