విశ్వజననీ పరిషత్‌కు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

విశ్వజననీ పరిషత్‌కు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం

Jan 5 2026 8:10 AM | Updated on Jan 5 2026 8:10 AM

విశ్వ

విశ్వజననీ పరిషత్‌కు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం

విశ్వజననీ పరిషత్‌కు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం రేషన్‌ బియ్యం స్వాధీనం చెక్‌డ్యాంలో పడి యువకుడు మృతి ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి వైభవంగా క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం

బాపట్లటౌన్‌: ఆంధ్ర సరస్వత్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో జిల్లెల్లమూడి అమ్మవారికి చెందిన విశ్వజననీ పరిషత్‌ ట్రస్ట్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్ర శ్రీ పూర్ణకుంభ పురస్కారం దక్కింది. స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా విశ్వజననీ పరిషత్‌ ట్రస్ట్‌ పూర్వ అధ్యక్షులు బొప్పూడి రామబ్రహ్మం, మేనేజింగ్‌ ట్రస్టీ వల్లూరి ప్రేమ్‌ రాజు పురస్కారాన్ని అందుకున్నారు.

రేపల్లె: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన పెనుమూడి చెక్‌పోస్ట్‌ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. సీఐ వి.మల్లికార్జునరావు తెలిపిన వివరాల మేరకు.. పెనుమూడి చెక్‌పోస్ట్‌ వద్ద తమ సిబ్బందితో తనికీలు నిర్వహిస్తున్నారు. వేమూరు నుంచి కాకినాడ రేషన్‌ బియ్యంతో వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేశారు. వేమూరుకు చెందిన అమర్తలూరి కోటేశ్వరరావు వద్ద కాకినాడకు చెందిన కొండమూరి చంద్రారావు 500 బ్యాగులలో 25.86 క్వింటాళ్ల బియ్యంను కొనుగోలు చేసి లారీలో తరలిస్తున్నట్లు తెలిసింది. లారీ డ్రైవర్‌ ఆకుల శివకృష్ణ మణికంఠను అదుపులోకి తీసుకుని బియ్యం సీజ్‌ చేసి లారీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. తనిఖీలలో ఎస్‌ఐ రాజశేఖర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మేదరమెట్ల: ఈత కోసం చెక్‌డ్యాంలో దిగి ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన కొరిశపాడు మండలం రాచపూడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. రాచపూడి ఎస్సీ కాలనీకి చెందిన పల్లి చినబాబు (20) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాచపూడి–పమిడిపాడు మధ్యలో ఉన్న చెక్‌ డ్యాం వద్దకు ఆదివారం ఈతకు వెళ్లారు. ఈత కోసం నీటిలో దిగిన ముగ్గురిలో చినబాబు నీటిలో మునిగిపోతున్న సమయంలో గమనించిన స్నేహితులు అతన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సమాచారాన్ని చినబాబు బంధువులకు అందచేశారు. కొరిశపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఈతగాళ్ల సహకారంతో చెక్‌డ్యాంలో పడిపోయిన చినబాబును బయటకు తీయించారు. అప్పటికే చనిపోయి ఉండటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నెహ్రూనగర్‌: ఆంధ్రప్రదేశ్‌లో ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్‌ ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు. సంపత్‌నగర్‌లో ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజధానిలో ముదిరాజ్‌ కమ్యూనిటీ భవన్‌ కోసం ఐదెకరాల స్థలం ఇవ్వాలని కోరారు. బీసీ డీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ ఏలోకి మార్చాలన్నారు. జనాభా దామాషా ప్రకారం నామినేట్‌ పదవుల్లో ముదిరాజ్‌లకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. సమావేశంలో ముదిరాజ్‌ మహాసభ ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బారాయుడు, గౌరవ అధ్యక్షుడు జయరాం, జిల్లా అధ్యక్షుడు గొడుగు శంకర్‌, రాజు, సాంబశివరావు, రాంబాబు, శేఖర్‌, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ఫిరంగిపురం: మండలకేంద్రంలోని బాల ఏసు కథెడ్రల్‌ దేవాలయంలో ఆదివారం శ్రీసభలో క్రీస్తు సాక్షాత్కార (ముగ్గురు రాజుల పండుగ)మహోత్సవం నిర్వహించారు. దివ్యపూజాబలి నిర్వహించారు. బాల ఏసు కథెడ్రల్‌ దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి వాక్యోపదేశం చేశారు. దేవుని కుమారుడు మానవుడిగా జన్మించాడని చెప్పారు. సహాయ విచారణగురువులు సాగర్‌ పాల్గొన్నారు.

విశ్వజననీ పరిషత్‌కు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం  1
1/4

విశ్వజననీ పరిషత్‌కు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం

విశ్వజననీ పరిషత్‌కు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం  2
2/4

విశ్వజననీ పరిషత్‌కు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం

విశ్వజననీ పరిషత్‌కు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం  3
3/4

విశ్వజననీ పరిషత్‌కు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం

విశ్వజననీ పరిషత్‌కు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం  4
4/4

విశ్వజననీ పరిషత్‌కు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement