జాతీయ కబడ్డీ పోటీలకు ఇద్దరు ఎంపిక
చినగంజాం: మండలానికి చెందిన ఇరువురు విద్యార్థులు 69వ జాతీయ ఛాంపియన్ షిప్ స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపికై నట్లు బాల కోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు, కబడ్డీ కోచ్, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు ఎం.గిరిబాబు తెలియజేశారు. గత రెండు సంవత్సరాలుగా బాల కోటేశ్వర స్పోర్ట్స్ క్లబ్‌లో శిక్షణ పొందుతూ స్థానిక సత్యం హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న మండలంలోని కొత్తపాలెం పంచాయతీ శాంతినగర్‌కు చెందిన గాలి శ్రీనివాసరెడ్డి ఎంపికై నట్లు తెలిపారు. అతడు అండర్ 17 విభాగంలో తెలంగాణలోని బయ్యారంలో ఈ నెల 7,8,9,10,11 తేదీల్లో నిర్వహించే స్కూల్ గేమ్స్ పోటీలకు హాజరవుతున్నట్లు తెలిపారు. చినగంజాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కొత్తపాలెం పంచాయతీ మూలగానివారిపాలెం గ్రామానికి చెందిన భోగిరెడ్డి వేణుగోపాలరెడ్డి ఎంపికై నట్లు తెలిపారు. అతడు అండర్–14 విభాగంలో చత్తీస్‌ఘడ్‌లోని దుర్గాలో ఈనెల 6,7,8,9 తేదీల్లో నిర్వహించే స్కూల్ గేమ్స్‌కు హాజరవుతున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గిరిబాబుతో పాటు సత్యం హైస్కూల్ కరస్పాండెంట్ నున్నా హరినాఽథ్, పాఠశాల సిబ్బంది, జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం కె.శ్రీనివాసరెడ్డి, పీడీ అంకమ్మ, స్పోర్ట్స్ క్లబ్ సమ్మర్ కోచింగ్‌కు ఆర్థిక సహకారం అందించిన డాక్టర్ నల్లూరి సుబ్బారావు, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు పోలీస్ శాఖలో డీఎస్పీ వేణుగోపాల్‌లు వీరికి అభినందనలు తెలియజేశారు.
జాతీయ కబడ్డీ పోటీలకు ఇద్దరు ఎంపిక


