ప్రపంచ తెలుగు మహాసభల్లో పేరిరెడ్డికి సన్మానం
ఇంకొల్లు(చినగంజాం): గుంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇంకొల్లు మండలం ఇడుపులపాడు విద్యాపరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పిడవర్తి పేరిరెడ్డికి ఆదివారం సన్మానం చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆదివారం నిర్వహించిన కవితా శీర్షికలో బాపట్ల జిల్లా శాఖ సంచాలకులు పిడవర్తి పేరిరెడ్డి కవిత్వాన్ని ప్రదర్శించారు. ఇందుకు కార్యనిర్వాహకవర్గం అతనిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకుడు కొత్తగూడెం రాజేష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తెలుగు ప్రాభవాన్ని వివరించిన శ్రీరామచంద్రమూర్తిరెడ్డి
3వ ప్రపంచ తెలుగు మహాసభలలో చినగంజాం మండలం కొత్తపాలెం పంచాయతీ మూలగాని వారిపాలెం గ్రామానికి చెందిన సాహితీవేత్త, కవి కుక్కల శ్రీరామచంద్రమూర్తి రెడ్డి తెలుగు భాష గొప్పదనాన్ని గురించి సభలో వివరించారు. ఆయనను కార్యనిర్వాహకులు అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు.


