రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్
చీరాల: అమృత్ భారత్ పథకంలో భాగంగా చీరాల రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన సాగడం, పలు నిర్మాణ పనులు ప్రయాణికులకు అసౌకర్యంగా ఉండడంతో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాపట్ల, చీరాల రైల్వేస్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం పరిశీలించారు. ప్లాట్‌ఫాంపై జరుగుతున్న పనులను పరిశీలించారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని చీరాల, బాపట్ల, రేపల్లె రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే క్రమంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. మరోవైపు బాపట్ల – రేపల్లె కొత్త రైల్వే లైను, బాపట్ల నుంచి పర్చూరు మీదుగా మార్కాపురం వరకు కొత్త రైల్వేలైను మార్గానికి ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు.


