గోవాడ దేవస్థానం కమిటీ ప్రమాణస్వీకారం
గోవాడ(వేమూరు): బాల కోటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి ధర్మకర్తల మండలి సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోరారు. అమృతలూరు మండలంలోని గోవాడ శ్రీ బాల కోటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పావులూరు రమేష్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు 11 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఆలయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వాతావరణం పరిరక్షణతో పాటు ఆలయ సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రమాణస్వీకారం చేసిన కమిటీ సభ్యుల్లో కాటం నాగేశ్వరరావు, రామదాసు శ్రీనివాసరావు, మండవ అనంతలక్ష్మి, దేవీ హైమా ప్రియా, బన్నారపూరి అంజనేయులు, కొండవీటి లక్ష్మీభ్రమరాంబ, మోపిదేవి లక్ష్మి, గండికోట పోలయ్య, అల్లూరు విజయకుమారి, అమృతలూరు బాబూరావు ఉన్నారు.


