రూ. 300 కోట్ల మేర నష్టం
జిల్లాలో వరద నష్టం పక్కన బెడితే ఈ రెండు నియోజకవర్గాల్లో నీటిలో మునిగిన వరి సాగుకు రైతులు ఎకరాలకు రూ. 25 వేల చొప్పున రూ. 150 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. దిగుబడి ఎకరాకు మరో రూ. 25 వేలు అనుకుంటే రైతులు రూ. 300 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉండడం అంటే సమస్య ఉత్పన్నం కాకుండా చూడడం, సమస్య తలెత్తినా పరిష్కరించడం. అవన్నీ వదిలేసి తామేదో తుఫాన్‌ను నియంత్రించినట్లు సర్కార్ పెద్దలతోపాటు అధికార యంత్రాంగం చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు.


