సహకార వ్యవస్థ బలోపేతంతోనే మానవాళి మనుగడ
కొరిటెపాడు: సహకార వ్యవస్థ బలోపేతంతోనే మానవాళి మనుగడ సాధ్యమని ది విశాఖపట్నం కో ఆపరేటీవ్ బ్యాంకు లిమిటెడ్ డైరెక్టర్స్ పి.వి.మల్లికార్జునరావు, సీహెచ్.రామారావు, చిన్నం కోటేశ్వరరావులు పేర్కొన్నారు. గుంటూరులోని కొరిటెపాడులో ఉన్న ది విశాఖపట్నం కో ఆపరేటీవ్ బ్యాంకు లిమిటెడ్ గుంటూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆదివారం సహకార సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ సహకార వ్యవస్థ ప్రాధాన్యతను విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిందన్నారు. సహకార సూత్రాల కనుగుణంగా అందరి కోసం ప్రతి ఒక్కరూ అనే సూత్రంతో సామాజిక ఆర్థిక సంస్థలుగా సహకార సంఘాలు నిర్వహించకోవడానికి ఇంటర్నేషనల్ కో ఆపరేటీవ్ ఎలియన్స్ ఏడు సహకార సూత్రాలు ప్రతిపాదించిందన్నారు. విశాఖపట్నం కో ఆపరేటీవ్ బ్యాంకు లిమిటెడ్ ప్రజల కోసం అనేక సౌకర్యాలను కల్పించడం జరుగుతోందన్నారు. సంక్షేమ పథకాలు, ఆరోగ్య బీమా, ఉచిత ప్రమాద బీమా, విద్యా ప్రతిభా పురస్కారాలను బ్యాంకు సభ్యులకు అందించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ ఇ.ఎర్రయ్యరెడ్డి, మేనేజర్ బుల్లికుమార్, కమిటి సభ్యులు కోట మాల్యాద్రి, డి.వెంకటరామయ్య, ఎస్.లక్ష్మీసుజాత, చిన్న, బ్రాంచ్ మేనేజర్‌లు, బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


