బ్రాహ్మణుల అభ్యున్నతిలో ఉద్యోగుల పాత్ర కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: బ్రాహ్మణ సమాజ అభ్యున్నతిలో బ్రాహ్మణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్‌ప్రసాద్ అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా బ్రాహ్మణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ సేవాసమితి ఆధ్వర్యంలో ఏటీ అగ్రహారంలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో కార్తిక వన సమారాధాన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బుచ్చి రామ్‌ప్రసాద్ మట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమానికి, అభివృద్ధికి అవసరమైన సహాయ, సహకారాలను బ్రాహ్మణ కార్పొరేషన్ అందిస్తుందని అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. అదే విధంగా గుంటూరు నగరంలో విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. సేవా సమితి అధ్యక్షుడు జంగాలపల్లి పార్థసారథి మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు ఆర్థిక సహాయంతోపాటు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. బ్రాహ్మణ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమానికి సమితి తరపున కృషి చేస్తున్నామని, సమితి నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సభ్యులు సహకరించాలని కోరారు. బ్రాహ్మణులు ఉద్యోగాలతో పాటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారని, అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణించాలని సూచించారు. బుచ్చి రామ్‌ప్రసాద్, గంగాధర్‌లకు జ్ఞాపికలను బహూకరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, సమితి సభ్యులు టి.శివన్నారాయణ, మల్లికార్జునశర్మ, ఈవీ శ్రీనివాస్, జి.వేణుగోపాలరావు, అరుణ్‌కుమార్, గౌరీనాథ్, కమల్‌మోహన్, హరగోపాల్, ఏపీ ఎన్జీవో నాయకులు నరసింహమూర్తి, సీతా రమేష్, కె.రాధాకృష్ణమూర్తి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అరంతరం విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. బ్రాహ్మణులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్
చైర్మన్ బుచ్చి రామ్‌ప్రసాద్


