● బలం లేకున్నా టీడీపీ బరితెగింపు ● వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై వేధింపుల పర్వం ● అవిశ్వాసం అంటూ డ్రామా | - | Sakshi
Sakshi News home page

● బలం లేకున్నా టీడీపీ బరితెగింపు ● వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై వేధింపుల పర్వం ● అవిశ్వాసం అంటూ డ్రామా

Oct 10 2025 6:02 AM | Updated on Oct 10 2025 6:02 AM

● బలం లేకున్నా టీడీపీ బరితెగింపు ● వైఎస్సార్‌సీపీ అభ్యర

● బలం లేకున్నా టీడీపీ బరితెగింపు ● వైఎస్సార్‌సీపీ అభ్యర

● బలం లేకున్నా టీడీపీ బరితెగింపు ● వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై వేధింపుల పర్వం ● అవిశ్వాసం అంటూ డ్రామా

ముప్పాళ్ల: ముప్పాళ్ల మండల పరిషత్‌ అధ్యక్ష పీఠంపై టీడీపీ నాయకులు గురి పెట్టారు. 2021లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు పదకొండు స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. టీడీపీ ఒక్కచోట కూడా గెలిచిన దాఖలాలు లేవు. మాదల ఎంపీటీసీ సభ్యుడు మృతి చెందగా ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది. భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తూ, పదవి ఆశ చూపుతూ ఆరుగురు ఎంపీటీసీలను టీడీపీ వైపునకు లాక్కున్నారు. ఎంపీపీతో కలిపి నలుగురు ఎంపీటీసీలు వైఎస్సార్‌ సీపీని వీడేందుకు ఇష్ట పడకపోవటంతో వారిపైన, వారికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను దెబ్బకొట్టేలా అధికార దర్పాన్ని ఉపయోగించుకుంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

కొత్తగా తెరపైకి అవిశ్వాసం డ్రామా

కొత్తగా ఎంపీపీపై అవిశ్వాస డ్రామాను టీడీపీ నాయకులు తెర లేపారు. చాగంటివారిపాలెంకు చెందిన ఎంపీపీ మారూరి పద్మపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు సమావేశం నిర్వహించాలంటూ సత్తెనపల్లి ఆర్డీఓను మంగళవారం కలసి వినతిపత్రం అందించారు. అవిశ్వాస తీర్మానం ఇవ్వాలంటే కనీసం 8 మంది ఎంపీటీసీ సభ్యుల బలం ఉండాలి. ఎనిమిది మంది సభ్యులు ఆర్డీవో ఎదుట హాజరై అవిశ్వాస తీర్మానం కోరుతూ వినతిపత్రం అందించాల్సి ఉంటుంది. కేవలం ఐదుగురు సభ్యులతో సంతకాలు చేయించి అవిశ్వాస తీర్మానం అంటూ డ్రామా చేస్తున్నారు. ఈ విషయం పై వైఎస్సార్‌సీపీ సభ్యులు మాత్రం పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు.

పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం.

–మలిరెడ్డి అనూష, లంకెలకూరపాడు ఎంపీటీసీ

సోషల్‌మీడియాలో టీడీపీ నాయకులు చేస్తున్న విష ప్రచారంలో వాస్తవం లేదు. అవిశ్వాస తీర్మానంపై ఆర్డీఓకు ఇచ్చిన పేపర్లలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వైఎస్సార్‌ సీపీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement