
జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలు
మానసిక వ్యాధులకు జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలను అందించటంతోపాటుగా మందులు కూడా ఉచితంగానే అందజేస్తున్నారు. అవుట్ పేషేంట్ విభాగంలోని 21వ నెంబర్ గదిలో వైద్య పరీక్షలు చేసి అవసరం ఉన్న వారిని ఇన్‌పేషేంట్ విభాగంలో అడ్మిట్ చేసుకుంటారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఓపీలో వైద్య సేవలు లభిస్తాయి. మందులతోపాటుగా రోగులకు కౌన్సెలింగ్ కూడా చాలా ముఖ్యం.
– డాక్టర్ నీలి ఉమాజ్యోతి,
మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్.