
12న బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక
తెనాలి: స్థానిక ఆంధ్రా ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ‘రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక’ జరగనుంది. బోసురోడ్డులోని నూకల రామకోటేశ్వరరావు కల్యాణ మండపంలో కార్యక్రమం ఉంటుంది. స్థానిక రామలింగేశ్వరపేటలోని మూల్పూరు సుబ్రహ్మణ్య కల్యాణ మండపంలో గురువారం విలేకరుల సమావేశంలో కేంద్రం పాలకవర్గ అధ్యక్షుడు టి.దక్షిణామూర్తి సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఉచిత భోజన సౌకర్యంతోపాటు సమాచార బుక్‌లెట్ ఇస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి ఎన్‌వీ సత్య కుమార్, సంయుక్త కార్యదర్శి పింగళి వేణుధర్, గౌరవాధ్యక్షుడు పీఎల్‌జీఎస్ ప్రకాశరావు, కోశాధికారి ఆర్.రాజేంద్రప్రసాద్, గౌరవ సలహాదారు బీఎల్ సత్యనారాయణమూర్తి, సభ్యులు డీవీ సోమయ్య శాస్త్రి పాల్గొన్నారు.