
బాపట్ల
న్యూస్‌రీల్
రైతు చూపు సుబాబుల్ వైపు జిల్లాలో 20వేల ఎకరాల్లో సాగు ధర కూడా వస్తుండటంతో ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం టన్ను రూ.5,800లకు కాగితం తయారీ కంపెనీలు కొనుగోలు ఒకసారి వేస్తే 20 ఏళ్ల వరకు దిగుబడి పశువుల మేతగా ఉపయోగపడనున్న ఆకులు రాజమండ్రి, భద్రాచలం, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాలకు ఎగుమతి
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
భారత రాయబారిగా విల్సన్ బాబు నియామకం
కూటమి కుట్రలపై విధేయతదే విజయం!
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 66,450 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 64,450 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు .
ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం
నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి తెలంగాణ మధిరకు చెందిన జంగా రామ్ భూపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు రూ.లక్ష అందజేశారు.
క్రాకర్స్ షాపుల్లో తనిఖీలు
చిలకలూరిపేట టౌన్: దీపావళి క్రాకర్స్ షాపుల్లో గురువారం పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. యజమానుల వద్ద ఉన్న లైసెన్సులు, అనుమతి పత్రాలను పరిశీలించారు.
అద్దంకి: అన్నదాతలకు సంప్రదాయ సాగు భారంగా మారింది. అధిక పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు పీల్చి పిప్పి చేస్తున్నాయి. తీరా పంట చేతికొచ్చేసరికి పడి పోతున్న ధరలతో నష్టాలే మిగులుతున్నాయి. సంప్రదాయ పంటల సాగుకు వెనకడుగు వేస్తున్నారు. తక్కువ ఖర్చుతో లాభాలొచ్చే పంటలపై ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఒక్కసారి నాటితే ఇరవై సంవత్సరాల పాటు ఆదాయాన్నిచ్చే సుబాబుల్ సాగు వైపు అడుగులేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 20 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. ఈ ఏడాది మరో 10 వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది.
వేగంగా పెరిగే సుబాబుల్
వేగంగా పెరిగే చెట్ల జాతిలో సుబాబుల్ ఒకటి. దీని ఆకులు పశుగ్రాసంగా ఉపయోగ పడతాయి. కాండాన్ని కాగితపు గుజ్జు పరిశ్రమలో ముడి సరుకుగా ఉపయోగిస్తారు. చౌడు నేలల మినహా అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఎక్కువ తేమ కలిగిన నేలలు బాగా అనుకూలం. కాలువ, పొలాల గట్లపై పెంచుకోవచ్చు. నాటిన రెండు నుంచి మూడేళ్లకే కర్ర దిగుబడి వస్తుంది.
నేలసారం పెంపు
సుబాబుల్ తోటల సాగుతో సారం పెరుగుతుంది. నేలలోని పెట్రోలియం, పురుగు మందులు, భారీ లోహాలు వంటి కలుషితాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. రాలిన ఆకు ఎరువుగా మారి భూమి సారవంతంగా మారుతుంది.
ఏటేటా పెరగనున్న ఆదాయం
సుబాబుల్ చెట్టు కర్రను ఒలిచే పని లేకుండా నేరుగా కొట్టి విక్రయించుకోచచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను ధర రూ.5,800 పలుకుతోంది. రెండు సంవత్సరాల తోట అయితే ఎకరాకు రూ.1 లక్ష వరకు, నాలుగు సంవత్సరాలు అయితే ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ. 2.5లక్షల వరకు ఆదాయం వస్తుండటంతో పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
I
పదేళ్ల నుంచి
సాగు చేస్తున్నా..
ఎకరాకు
30 టన్నుల దిగుబడి
నేను పదేళ్ల నుంచి సుబాబుల్ సాగు చేస్తున్నా. గిట్టుబాటు ధర బాగుంది. ఎరువు వేసి నీరు పెడితే మంచి దిగుబడి వస్తుంది. పైగా కర్ర తాట తీసే పనిలేకుండా కొనుగోలు చేస్తారు. పెద్దగా నీటి అవసరం లేదు. సాగు చేయటం కూడా తేలిక. సుబాబుల్ కర్రను కాగితం తయారీ కంపెనీలు కొంటున్నాయి. –కోటేశ్వరరావు, రైతు
సాలుకు సాలుకు మధ్య రెండు మీటర్లు, మొక్క మొక్కకు మధ్య రెండు మీటర్ల దూరం ఉండాలి. ఎకరాకు 666 మొక్కల నుంచి 1000 వరకు నాటుకోవచ్చు. ఎకరాకు 30 టన్నుల నుంచి సారవంతమైన నేలలు అయితే 40 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుంది. చెట్టు మూడు నుంచి నాలుగు సంవత్సరాలో 20 మీటర్ల ఎత్తు పెగుతుంది. ముదురుతోటలో విత్తనాలు సేకరించి నాటుకోచ్చు. లేదా నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి నాటుకోవచ్చు.

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల