
చేయీ చేయి కలిపారు..
నాడు
నేడు
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా స్థానిక విఠలేశ్వరస్వామి నగర్ కాలనీ
నివాసితులు నడుం కట్టారు. చేయీ చేయి కలిపి రోడ్డును వేసుకున్నారు. ఇటీవల వర్షాలకు కాలనీ ప్రధాన రహదారి కాలువగా మారింది. నీరు నిలిచి పసికర్లు కూడా కట్టింది. నివాసితుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వృద్ధులు, చిన్నారులు నానా అవస్థలు పడుతున్నారు. అసలే లోతట్టు ప్రాంతం. పైగా కాలనీ పక్కగా వెల్లటూరు చానల్ పారుతుండటంతో ఊట నీరు దిగి మరింత ముంపునకు గురవుతోంది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి రహదారులు
తటాకాలను తలపిస్తున్నాయి. సమస్యను అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. నిల్వ నీటితో జ్వరాలు, వ్యాధులు
ప్రబలుతాయేమోనని భయంతో వణికిపోయారు. దీంతో కాలనీలోని అంతర్గత రహదారిలో
నివసిస్తున్న ఏడుగురు కలసి సొంత ఖర్చుతో రోడ్డుకు మెరక తోలించుకున్నారు. – భట్టిప్రోలు

చేయీ చేయి కలిపారు..