
జాబ్‌మేళాలో 60 మందికి ఉద్యోగాలు
పిడుగురాళ్ల: జాబ్ మేళాలో 60 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఇ.తమ్మాజీ రావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆదేశాలతో ఈ జాబ్‌మేళా నిర్వహించారు. తమ్మాజీ రావు మాట్లాడుతూ జాబ్‌మేళాకు 10 కంపెనీలు హాజరు కాగా, 214 మంది నిరుద్యోగులు హాజరయ్యారని, అందులో 60 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ బి.వి.కృష్ణారెడ్డి, జిల్లా ఉద్యోగ కల్పనా అధికారి ఎం.రవీంద్ర నాయక్, పిడుగురాళ్ళ స్కిల్ హబ్ కో–ఆర్డినేటర్ పి. శ్రీకాంత్, వీరాంజినేయులు, రమ్య, అంజిరెడ్డి, సురేష్, మస్తాన్, కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి
సంస్థ అధికారి ఇ.తమ్మాజీ రావు