జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ
దుగ్గిరాల: మండలంలోని పెదకొండూరులో మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని శనివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు సమర్థంగా నిర్వహించి, దేశ ఉప ప్రధానిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా వీర్లపాలెం నుంచి పెదకొండూరు గ్రామం వరకు ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ మందా కృష్ణని ఊరేగింపుగా తీసుకువచ్చారు. కార్యక్రమాన్ని విగ్రహ కమిటీ పర్యవేక్షించింది.
విద్యుత్ పర్యవేక్షక ఇంజినీర్‌గా రమేష్ బాధ్యతల స్వీకరణ
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు సర్కిల్ విద్యుత్ శాఖ నూతన పర్యవేక్షక ఇంజినీరుగా పొన్నూరు రోడ్డులోని కార్యాలయంలో చల్లా రమేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన కేవీఎల్‌ఎన్ మూర్తి ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం జనరల్ మేనేజర్‌గా బదిలీ అయ్యారు. రమేష్ కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తూ బదిలీపై గుంటూరు పర్యవేక్షక ఇంజినీరుగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంటూరు సర్కిల్‌ను కంపెనీలో ప్రథమ స్థానానికి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు.
పానకాలస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం
మంగళగిరి: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి (పానకాల) ఆలయం శనివారం భక్తులతో రద్దీ మారింది. ఎగువ, దిగువ సన్నిధుల వద్ద కోలాహలం కనిపించింది. ఎగువ సన్నిధిలో భక్తుల రద్దీతో దర్శనానికి గంటకుపైగా సమయం పట్టింది.
వైకుంఠవాసుడికి ఊయల సేవ
తెనాలి టౌన్: స్థానిక శ్రీ లక్ష్మీపద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో శనివారం సాయంత్రం ఊయల సేవను కన్నుల పండువగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని, శ్రీ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. కొండెపి వసుంధర బృందం వీనులవిందుగా భక్తి గీతాలు అలపించింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ మాట్లాడతూ ప్రతి శనివారం సాయంత్రం 6గంటలకు ఊయల సేవను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ
జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ
జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ


