ప్రయాణమే.. పెను సవాలు | - | Sakshi
Sakshi News home page

ప్రయాణమే.. పెను సవాలు

Dec 20 2025 7:14 AM | Updated on Dec 20 2025 7:14 AM

ప్రయా

ప్రయాణమే.. పెను సవాలు

ప్రయాణమే.. పెను సవాలు బాపట్ల: జిల్లాలో పలు చోట్ల వంతెనలు ప్రమాదకరంగా మారాయి. ప్రయాణికులను రక్షించేందుకు నిర్మించిన సైడ్‌వాల్స్‌ పూర్తిగా విరిగిపోయాయి. అధికారుల వాటిపై దృష్టి సారించిన దాఖలాలు కూడా లేవు. తాత్కాలిక మరమ్మతులైనా నిర్వహించాలని స్థానికులు అనేక సార్లు వేడుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆర్‌ అండ్‌ బీ, డ్రైనేజీ శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రతి రెండు, మూడు నెలలకొకసారి ఆయా కాలువల వద్ద ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మండలంలోని పోతురాజు కొత్తపాలెం – వెదుళ్ల పల్లి సమీపంలోని జీబీసీ రోడ్డు వరకు నిర్మించిన బీటీ రోడ్డుకు మార్గమధ్యలో ఎత్తిపోతల పథకాల వద్ద కాలువకు సైడ్‌వాల్స్‌, కనీసం దిమ్మెలు కూడా లేవు. దీనికి తోడు రోడ్డు కూడా చిన్నదిగా ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో అటువైపుగా గేదెలు వెళ్తుండగా, ఎదురుగా లారీ రావడంతో బెదిరిపోయి కాలువలో పడి మృత్యు వాత పడ్డాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలువకు సైడ్‌వాల్స్‌ను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. బాపట్ల నుంచి మూలపాలెం వెళ్లే దారిలో ఈస్ట్‌ శ్యాంప్‌ డ్రైన్‌పై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. సైడ్‌వాల్స్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. కాలువ వెడల్పు తక్కువగా ఉంది. చాలా లోతుగా ఉంటుంది. రోడ్డు కూడా చిన్నదిగా ఉండటం వలన ఎదురుగా వస్తున్న వహనాలను తప్పించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సైడ్‌వాల్స్‌ లేకపోవడం వలన ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన భారీ వర్షాలకు డ్రైన్‌ పొంగి నీరంతా పోతోంది. మండలంలోని అప్పికట్ల– మర్రిపూడి మార్గ మధ్యలో ఉన్న పంట కాలువపై నిర్మించిన కల్వర్టు శిథిలావస్థకు చేరింది. కనీసం సైడ్‌ వాల్స్‌ కూడా లేకపోవడంతో నిత్యం ఆ ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు రోడ్డు బ్రిడ్జి ముందు చాలా పల్లంగా ఉండటం, అక్కడే మలుపు తిరగాల్సి రావడంతో వాహన చోదకులకు ఎదురుగా వస్తున్నవి కనిపించడం లేదు. నిత్యం ప్రమాదాలకు గురి కావాల్సి వస్తోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి కల్వర్టుకు సైడ్‌వాల్స్‌ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. మలుపు తిరిగే ప్రదేశంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

పులిచింతల ప్రాజెక్టు సమాచారం

బాపట్ల
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

అటుగా వెళ్లాలంటేనే హడల్‌

ఆదమరిస్తే అంతే సంగతులు

జాగ్రత్త పడాల్సిందే..

వేమూరు నియోజకవర్గానికి రెండో స్థానం

వంతెనల నిర్వహణపై

అధికారుల శీతకన్ను

సైడ్‌వాల్స్‌ విరిగి ఏళ్లు గడిచినా

అదే నిర్లక్ష్యం

ప్రమాదకరంగా మారిన

కాలువల పరిసర రహదారులు

అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 41.8813 టీఎంసీలు.

పాలకులు, అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన వంతెనలు నేటికీ దర్శనం ఇస్తూనే ఉన్నాయి. పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఆయా మార్గాలలో ప్రయాణం అంటేనే ప్రజలకు పెను సవాలుగా మారింది. కొన్ని చోట్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.

ప్రయాణమే.. పెను సవాలు 1
1/4

ప్రయాణమే.. పెను సవాలు

ప్రయాణమే.. పెను సవాలు 2
2/4

ప్రయాణమే.. పెను సవాలు

ప్రయాణమే.. పెను సవాలు 3
3/4

ప్రయాణమే.. పెను సవాలు

ప్రయాణమే.. పెను సవాలు 4
4/4

ప్రయాణమే.. పెను సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement