ఎస్టీయూ (డి) డిమాండ్
అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎస్టీయూ(డి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగం కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక జేబీ స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఎస్టీయూ(డి) సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పా ల్గొన్నారు. సంఘం మండల అధ్యక్షుడు జి.ఆనందరావు అధ్యక్షత వహించారు. సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు అరుణారావు మాట్లాడుతూ పీఆర్‌సీపై ఇచ్చిన హామీని ప్రభుత్యం నిలబెట్టుకుని ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి ఎం.సాంబశివరావు మాట్లాడుతూ పెండింగులో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. ఎంఈఓ వై.ప్రసాదరావు మాట్లాడుతూ పాఠ శాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి మంటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఎస్టీయు(డి) మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం మండల గౌరవ అర్యక్షుడిగా అంకం బుజ్జిబాబు, అధ్యక్షుడిగా జి.ఆనందరావు, ఉపాధ్యక్షులుగా పీఎస్ కుమారి, శ్రీనివాసరావు, కార్యదర్శిగా ఎం.అదాలు, సహాయ కార్యదర్శులుగా షేక్ షారాభి, బైమున్నీసా, మహిళా కార్యదర్శిగా అన్నం వేణుకుమారి, ఆర్థిక కార్యదర్శిగా కుంభా సాంబశివరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా వి.అరుణరావు, ఎం.సాంబశివరావు, డి.కోటేశ్వరరావులు ఎంపికయ్యారు. ఎంఈఓ–2 శివబాబు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.