ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 28-06-2026 To 04-07-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Jun 28 2026 3:06 AM | Updated on Jun 28 2026 3:06 AM

Weekly Horoscope Telugu 28-06-2026 To 04-07-2026

మేషం...
క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులు సహాయం అందిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పరపతి పెరుగుతుంది. నూతన పరిచయాలు  ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులకు ఊహించని సన్మానాలు, అవార్డులు. వారం ప్రారంభంలో చికాకులు. మానసిక అశాంతి. గులాబీ, లేత ఎరుపు రంగులు.  దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృషభం...
కొన్ని కార్యక్రమాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో కాస్త పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొంటారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. చర్చలు ఫలిస్తాయి. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో రుణయత్నాలు. ఆరోగ్యసమస్యలు. చిత్రమైన సంఘటనలు.  ఎరుపు, నేరేడు రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మిథునం....
ప్రారంభంలో ఆరోగ్య, ఆర్థిక సమస్యలు ఎదురైనా క్రమేపీ అనుకూలిస్తాయి. పాతమిత్రులను కలుసుకుని జ్ఞాపకాలు నెమరువేసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు సన్మానాలు, పదవీయోగం. వారం చివరిలో బంధువిరోధాలు. చికాకులు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం...
అనూహ్యమైనరీతిలో పనులు పూర్తి కాగలవు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటాబయటా అనుకూలం. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం....
సన్నిహితులతో ఉత్సాహంగా  గడుపుతారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా కొనసాగుతాయి. విద్యార్థులకు విజయాలు చేకూరతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తుల విషయంలో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. కళాకారులకు ఊహించని అవకాశాలు రావచ్చు.  వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కన్య....
అప్రయత్న కార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. అదనపు రాబడి పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

తుల...
ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు. సంతానరీత్యా కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో స్వల్పలాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో ధనలబ్ధి. సమస్యల నుంచి ఉపశమనం. ఎరుపు, గులాబీ రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృశ్చికం...
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహయోగం. చర్చలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు అనుకూల సమయం. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది. మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో మానసిక సంఘర్షణ. ధనవ్యయం. శ్రమాధిక్యం. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు.  ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు....
అనుకున్న రాబడి కొంత ఆలస్యమైనా అందుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు. విద్యార్థులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, లేత ఎరుపు రంగులు, గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మకరం...
విజయాల బాటలో నడుస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కీలక సమాచారం రాగలదు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు, సత్కారాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. మిత్రులతో కలహాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.

కుంభం...
బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. కొత్త విషయాలు గ్రహిస్తారు. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.  విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. పసుపు, నేరేడు రంగులు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

మీనం....
ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభం. కొన్ని వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు.  తీర్థయాత్రలు చేస్తారు. వాహనయోగం. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు.  శివస్తుతి మంచిది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement