మేషం..
ఆర్థిక పరిస్థితి కొంతనిరాశ పర్చినా అవసరాలకు లోటు ఉండదు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రముఖులతో ముఖ్య విషయాలపై ఉత్తరప్రత్యుత్తరాలు. పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు మరింత ఊరటనిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో మరింత పురోగతి ఉంటుంది. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐటీ నిపుణులు, కళాకారులకు కొత్త అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, నేరేడు రంగులు, నృసింహస్తోత్రాలు పఠించండి.
వృషభం...
కొత్త పనులు శ్రమపడ్డా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బం«ధువుల నుంచి ఊహించని ఆహ్వానాలు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తీరి ఉపశమనం లభిస్తుంది. వివాహాది శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మరిన్ని మార్పులు తథ్యం. క్రీడాకారులు, రాజకీయవర్గాలకు విశేషంగా కలసివస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. మానసిక అశాంతి. ఎరుపు, పసుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మిథునం...
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వాహనాలు, భూములు కొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. వైద్య, సాంకేతిక, పారిశ్రామికవర్గాలకు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వారం మధ్యలో ఆరోగ్యభంగం. మిత్రులతో కలహాలు. శ్రమాధిక్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం...
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న పనులు మరింత నిదానంగా సాగుతాయి. బంధుమిత్రులతో అకారణ ంగా విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు ఉండవచ్చు. క్రీడాకారులు, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, ఆకుపచ్చ రంగులు, శ్రీరామస్తోత్రాలు పఠించండి.
సింహం...
ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. మరింత పరపతి పెరిగి ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం చివరిలో మానసిక ఆందోళన. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. తెలుపు, చాక్లెట్‌రంగులు, కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కన్య....
ఇంటికి వచ్చిన బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. వైద్యులు, ఐటీ నిపుణులు, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా. ఇంటాబయటా ఒత్తిడులు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, శివపంచాక్షరి పఠించండి.
తుల....
ఆర్థికంగా గతవారం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. క్రీడాకారులు, కళాకారులు, రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. వారం చివరిలో ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. పసుపు, చాక్లెట్‌రంగులు, విష్ణుధ్యానం చేయండి.
వృశ్చికం...
కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులు, రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో మానసిక ఆందోళన. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఎరుపు, లేత పసుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి.
ధనుస్సు...
పనులు పూర్తి చేసి కానీ విశ్రమించరు ప్రతి విషయంలో పట్టుదలో వ్యవహరిస్తారు.. కుటుంబసభ్యులతో వివాదాలు కొంత తీరతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు రావచ్చు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న రీతిలో మార్పులు ఉంటాయి. క్రీడాకారులు, కళారంగం వారికి ఆహ్వానాలు రాగలవు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. అనారోగ్యం. ఆప్తులతో కలహాలు. నీలం, నేరేడు రంగులు, లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
మకరం...
అతి ముఖ్య వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాలు పరిష్కరించుకుని సత్తా చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు రావచ్చు. వైద్యులు, రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు, గణేశ్ స్తోత్రాలు పఠించండి.
కుంభం...
ఆర్థిక లావాదేవీలలో మరింత పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో అనూహ్యంగా విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. అత్యంత చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహన, గృహయోగాలు. వివాహ, ఉద్యోగయత్నాలలో కదలికలు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి పొందుతారు. కళాకారులు, ఐటీ నిపుణులు, రాజకీయవర్గాలకు నూతన అవకాశాలు రావచ్చు. వారం మధ్యలో అనారోగ్యం. శ్రమాధిక్యం. నేరేడు, ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి
మీనం....
ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహవంతంగా గడుపుతారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఒక వివాదం నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలు, ఐటీ నిపుణులు, కళారంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో మానసిక అశాంతి. కుటుంబంలో కొన్ని సమస్యలు. అదనపు ఖర్చులు. పసుపు, ఆకుపచ్చ రంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి.


