రోడ్డుప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

పీలేరురూరల్‌ : ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని ముడుపులవేముల పంచాయతీ కృష్ణారెడ్డిగారిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. పీలేరు మండలం మేళ్లచెరువు కస్పాకు చెందిన రమణారెడ్డి కుమారుడు మల్లికార్జునరెడ్డి (15) సోమవారం దిగువ వగళ్ల నుంచి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయలుదేరాడు. కృష్ణారెడ్డిగారిపల్లె వద్ద కల్వర్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మల్లికార్జునరెడ్డిని 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.

వేరు వేరు ప్రమాదాల్లో ..

మదనపల్లె టౌన్‌: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో సోమవారం ఇద్దరు తీవ్రంగా గాయపడి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.. పట్టణంలోని చంద్ర కాలనీకి చెందిన అబ్దుల్లా భార్య ముబారక్‌(36) ఆటోలో గురుకుల పాఠశాల వద్దకు వెళుతుండగా, మార్గ మధ్యం లోని చంద్రా కాలనీ మలుపు వద్ద కారు ఆటోను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. మండలంలోని సిటిఎంలో ఆటో ఢీకొని వాల్మీకి పురానికి చెందిన స్కూటరిస్టు సత్య ప్రసాద్‌(26) తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని వెంటనే 108లో స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెరు గైన వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బొలెరో ఢీ కొట్టి..

నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్‌): బైక్‌ పై మదనపల్లెకు వస్తున్న వారిని బొలెరో వాహనం ఢీ కొట్టి తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం నిమ్మనపల్లి మండలంలో జరిగిన ఘటనపై బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మండలంలోని సోమానుపల్లికి చెందిన రైతు శేషాద్రి రెడ్డి (45), వారి దగ్గర బంధువు నవీన్‌ (20) సోమనుపల్లి నుంచి బైకై ్ప మదనపల్లెకు బయలుదేరారు. స్కూటర్‌ మార్గమధ్యంలోని ఎగువ మాసిరెడ్డి గారి పల్లె వద్దకు రాగానే బొలోరో వేగంగా వచ్చి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని స్థానికులు వెంటనే 108లో మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్య చికిత్సల అనంతరం శేషాద్రి రెడ్డి ని తిరుపతి రియాకు వెళ్లాలని రెఫర్‌ చేశారు. ఘటనపై నిమనపల్లి ఎస్సై రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కుక్కర్‌ పేలి వంట మాస్టర్‌కు..

నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్‌): నిమ్మనపల్లె మండలంలోని తవళం నేల మల్లేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం సందర్భంగా భక్తుల కోసం వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కుక్కర్‌ పేలి వంట మాస్టర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు..చౌడేపల్లి మండలం, బోయకొండ కొలింపల్లి కు చెందిన వంట మాస్టర్‌ వెంకటరమణ (63), తన అనుచరులతో వంట చేయడానికి ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి వంట చేస్తుండగా ఉన్నట్లుండి కుక్కర్‌ పేలి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలు కుంటూ ఉన్నాడు.

గాయపడిన సత్యప్రసాద్‌, ముబారక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement