పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల పరిశీలన

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

మదనపల్లె టౌన్‌ : స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి సోమవారం మదనపల్లె పట్టణంలో పర్యటించి కీలక పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. మొదట ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని జెడ్పీ హైస్కూల్‌లోని స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించి సీసీటీవీ పనితీరు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ గార్డుల బందోబస్తును తనిఖీ చేశారు. అనంతరం మాయాబజార్‌ వివేకానంద మున్సిపల్‌ హైస్కూల్‌లో ట్రాఫిక్‌ మళ్లింపులు, పార్కింగ్‌ ఏర్పాట్లపై సూచనలు చేశా రు. అలాగే ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. డీఎస్పీ బి.ప్రసాద్‌, వన్‌టౌన్‌ సీఐ మోహన్‌ కుమార్‌, టూ టౌన్‌ సీఐ గోపాల్‌ రెడ్డి, ఎస్బీ సీఐలు సదాశివయ్య, ఎరిషావలీ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 82 ఫిర్యాదులు

మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ వేదికకు మొత్తం 82 ఫిర్యాదులు వచ్చాయి. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఫిర్యాదుపై విచారణను వేగంగా పూర్తిచేసి, సంబంధిత నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement