మదనపల్లె మున్సిపాలిటీ
1961లో మదనపల్లి మున్సిపాలిటీగా ఏర్పడింది. అప్పటినుంచి 2021 ఎన్నిక వరకు చైర్మన్ పదవి జనరల్ గానే రిజర్వేషన్ అయింది. 2021లో ఒక్కసారి మాత్రమే జనరల్ మహిళ కింద రిజర్వ్ అయింది. ఒకసారి మహిళ మినహా మినహాయిస్తే ఎన్నికై న చైర్మన్లందరూ పురుషులే. ఈ మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారిగా బీసీ జనరల్‌కు రిజర్వేషన్ కావడం విశేషం. ఇప్పుడి మున్సిపాలిటీ సెలక్షన్ గ్రేడ్ స్థాయికి ఎదిగింది.
పుర చరిత్రను తిరగేస్తే..!
సాక్షి, మదనపల్లె : అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి మున్సిపాలిటీ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయ తీ చైర్మన్ పదవులు బీసీలకే రిజర్వ్ అయ్యాయి. అందులో ఒక బీసీ మహిళ, మూడు బీసీ జనరల్ కేటాయించారు. ఆయా మున్సిపాలిటీల చరిత్ర క్లుప్తంగా..


