ఫైర్‌ స్టేషన్లకు కొత్త వాహనాలు | - | Sakshi
Sakshi News home page

ఫైర్‌ స్టేషన్లకు కొత్త వాహనాలు

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

మదనపల్లి (కురబలకోట) : ప్రజల ఆస్తులను, ప్రాణాలను కాపాడే అగ్నిమాపక శాఖ మరింత పటిష్ట సేవలు అందించేందుకు జిల్లాలోని వాల్మీకిపురం, పుంగనూరు, లక్కిరెడ్డిపల్లి, పీలేరు, మదనపల్లిలోని ఫైర్‌ స్టేషన్లకు కొత్త వాహనాలను వినియోగంలోకి తెచ్చినట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆదినారాయణ రెడ్డి సోమవారం తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక యంత్రాంగం సంసిద్ధంగా ఉందని వివరించారు.

పోలీస్‌ శాఖలోకి

కొత్త జాగిలం ‘తారా’

మదనపల్లె టౌన్‌ : జిల్లా పోలీస్‌ శాఖలో నేరాలను పసిగట్టేందుకు, అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు అత్యంత చురుకైన బెల్జియన్‌ మాలినోయిస్‌ జాతికి చెందిన ’తార’ అనే జాగిలం చేరిందని ఎస్పీ ధీరజ్‌ సోమవారం మీడియాకు తెలిపారు.మంగళగిరి పోలీస్‌ డాగ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో 11 నెలల పాటు కఠిన శిక్షణ పొందిన ఈ జాగిలానికి పేలుడు పదార్థాలను ముందుగానే పసిగట్టడంలో, గాలి వాసనతో నేరస్తులను ట్రాక్‌ చేయడంలో అత్యంత నైపుణ్యం ఉందని వివరించారు.

రాష్ట్ర సీనియర్‌ హాకీ జట్టులో మదనపల్లె క్రీడాకారులు

సాక్షి, మదనపల్లె : ఉత్తరప్రదేశ్‌లోని రాంచీలో జరుగుతున్న 16వ హాకీ ఇండియా సీనియర్‌ పురుషుల నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర సీనియర్‌ జట్టుకు మదనపల్లె చెందిన ముగ్గురు హాకీ క్రీడాకారులు జిల్లా తరఫున ఎంపికై నట్టు జిల్లా హాకీ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు పివి.ప్రసాద్‌, జిపి.రాజు సోమవారం తెలిపారు. ఈ జట్టుకు మదనపల్లెకు చెందిన ఎల్‌.హితేష్‌రావ్‌ కెప్టెన్‌గా, జట్టులో క్రీడాకారులుగా వెంకట అఖిల్‌, మూజాహిద్‌ ఎంపిక అయ్యారని తెలిపారు.

జిల్లాలో ఉద్యాన హబ్‌ వారోత్సవాలు

మదనపల్లి (కురబలకోట) : జిల్లాలో ఈనెల 17 వరకు గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ పథకంపై అవగాహన వారోత్సవాలు నిర్వహించనున్న ట్లు కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌ తెలిపారు. జిల్లాలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. రైతులకు ఉద్యాన పంటల సాగు, సూక్ష్మ సేద్యం, యాంత్రీకరణ, కోత అనంతరం నిర్వహణ, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ తదితర అంశాలపై ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యమన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement