మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్యాయత్నం

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

మదనపల్లె టౌన్‌: కుటుంబ కలహాలతో ఓ మహిళ మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కురబలకోట మండలంలో సోమవారం చోటు చేసుకున్న ఘటనపై బాధ్యతరాలి కుటుంబీకులు ఆసుపత్రి అవుట్‌ పోస్ట్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కురబలకోట కు చెందిన జరీనా (50) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న యాసిడ్‌ తాగింది. కుటుంబీకులు గమనించి ఆమెను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలు కుంటూ ఉంది. ఘటనపై ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

శ్రీగంధం స్మగ్లింగ్‌: ఇద్దరు అరెస్ట్‌

గుర్రంకొండ: ఆర్టీసీ బస్సులో గుట్టుచప్పుడు కాకుండా శ్రీగంధం దుంగలను తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను గుర్రంకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 3 కిలోల శ్రీగంధం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపిన వివరాల మేరకు... సదుం మండలం యర్రాతివారిపల్లెకు చెందిన పంచెపాలెం (52), గుర్రంకొండ మండలం యల్లంపల్లెకు చెందిన సుధాకర్‌ (54)లు కొంతకాలంగా శ్రీగంధం చెట్లను అక్రమంగా నరికివేస్తూ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం వడ్డిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో శ్రీగంధం చెట్లను నరికి, వాటిని చిన్న చిన్న దుంగలుగా మార్చారు. వీటిని పీలేరులో విక్రయించడానికి గుర్రంకొండ – వాల్మీకిపురం ఆర్టీసీ బస్సు ఎక్కారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు తరిగొండ వద్ద సదరు బస్సును నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. నిందితుల సంచిలో అక్రమంగా తరలిస్తున్న శ్రీగంధం దుంగలను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్రబాబు పేర్కొన్నారు.

సిండికేట్‌గా మారి

ధరలు తగ్గించేస్తున్నారు

గుర్రంకొండ: మార్కెట్‌యార్డులో టమాటా మండీల యజమానులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గించేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక మార్కెట్‌యార్డులో మార్కెట్‌కమిటీ వైస్‌ చైర్మన్‌ నౌషాద్‌ఆలీ, మార్కెట్‌కమిటీ కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. ఈసందర్బంగా మండీల్లొ నిర్వహిస్తున్న వేలం పాటలను పరిశీలించారు. అనంతరం స్థానిక మార్కెట్‌యార్డు కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. మండీల యజమానులు సిండికేట్‌గా మారి టమాటా ధరలను తగ్గించేస్తున్నారని రైతులు ఆరోపించారు. వ్యాపారులు టమాటాల కొనుగోలుకు సంబందించి బిల్లులను సక్రమంగా చెల్లించడం లేదని, నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. వ్యాపారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని వైస్‌ చైర్మన్‌, కార్యదర్శులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలొ మార్కెట్‌కమిటీ డైరెక్టర్లు బయ్యారెడ్డి, బాబ్‌జాన్‌, యూడీసీ సునీల్‌ కుమార్‌, సూపర్‌వైజర్‌ నయిమ్‌భాషా, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement