రాజంపేట : కడప–రేణిగుంట గ్రీన్‌ఫీల్డ్ హైవేలో ప్రజాఅవసరాల రీత్యా పలుచోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ తపనసరి అన్న భావనను ఎన్‌హెచ్‌ఐఏ అధికారుల తమ దృష్టిలో ఉంచుకొని ప్రజాసౌకర్యం కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, రైల్వేస్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి తెలిపారు. బుధవారం ఈ మేరకు తన లేఖను నందలూరు మాజీ ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి ద్వారా తిరుపతి కార్యాలయంలోని ఎన్‌హెచ్‌ఐఏ డైరక్టర్‌కు అందచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హైవేలో ఒంటిమిట్ట, నందలూరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నారు. ఈ క్షేత్రాలకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వందలాదిగా వస్తుంటారు. కావున ఒంటిమిట్ట, నందలూరులో హైవే కనెక్టివిటీ ఇవ్వాలిసిన ఆవశక్యత ఉందన్నారు.అలాగే రాజంపేట–రాయచోటి (ఎస్‌హెచ్–34) ఉన్న కనెక్టివిటీ హైవేకు సుమారు 2.6కి.మీ అదనంగా రోడ్డు నిర్మితం చేయాల్సి ఉందన్నారు.తద్వారా ప్రభుత్వానికి అదనపు ఖర్చు అవుతుందన్నారు.ఇందుకు బదులుగా హైవేకు 200–300మీటర్ల దూరంలోనే కనెక్టిటివి ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలన్నారు. ఎన్‌హెచ్‌ఐఏ అధికారులను ఎంపీ తరపున కలిసిన వారిలో నందలూరు మాజీ కో–ఆప్షన్ సభ్యుడు కలీం, డీఆర్‌యూసీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి, ఆల్విన్ కార్మికనేత విజయుడు తదితరులు ఉన్నారు.


