మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్యాయత్నం

Oct 8 2026 3:24 AM | Updated on Oct 8 2026 3:24 AM

మదనపల్లె టౌన్‌ : అనారోగ్యం తాళలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చౌడేపల్లె మండలం దుర్గసముద్రానికి చెందిన పార్వతమ్మ (60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో బుధవారం ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వైద్యులు చికిత్స అందించినా ఆరోగ్యం కుదుటపడక పోవడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు. చౌడేపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నిచ్చెనపై నుంచి పడి గాయపడిన వ్యక్తి మృతి

మదనపల్లె టౌన్‌ : విద్యుత్‌ వైర్లను మరమ్మతు చేస్తూ నిచ్చెనపై నుంచి కింద పడి గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు మదనపల్లె తాలూకా ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. మదనపల్లె పట్టణం, నిమ్మనపల్లి క్రాస్‌ రోడ్డులో నివాసం ఉంటున్న వి. మాణిక్యం (45) ఈ నెల 4న బసినికొండ నిమ్మనపల్లి రోడ్డులోని నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న ఓ టీ దుకాణంలో విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో వైర్లను రిపేరు చేయడానికి నిచ్చెన ఎక్కాడు. వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాద వశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. హోటల్‌ యజమాని స్థానికంగా ప్రథమ చికిత్స అందించి తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఉపాధిహామీ రికార్డుల తనిఖీ

గాలివీడు : అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో రూ. 5.40 కోట్ల ఉపాధిహామీ పనుల రికార్డుల తనిఖీ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో రూ. 4.50 కోట్ల మేర సిమెంట్‌ రోడ్ల పనులే జరిగాయి. మిగిలిన నిధులతో చేపట్టిన గోకులాలు, క్యాటిల్‌ షెడ్లు, హార్టికల్చర్‌ పనుల చెల్లింపులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.ౖ ఉపాధిహామీ వెండర్లను మార్చి, అసలైన వారికి కాకుండా బినామీ ఖాతాలకు నగదు బదిలీ చేశారా? అనే అంశంపై సమగ్ర విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు సిబ్బంది 80 శాతం రికార్డులనుఅప్పగించారు.అందిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, అక్రమాలు జరిగినట్లు తేలితే వాస్తవాలను వెలికితీస్తామని సోషల్‌ ఆడిట్‌ ఎస్టీఎం కె.సత్యనారాయణ స్పష్టం చేశారు.

బాలిక అదృశ్యంపై కేసు నమోదు

వీరపునాయునిపల్లె : గంగిరెడ్డిపల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వెల్దుర్తి గ్రామానికి చెందిన బాలిక (17) అదృశ్యంపై కేసు నమోఛీనట్లు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెల్లిపోయి తిరిగి రాలేదు.బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు మేరకు కేసునమోదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement