తంబళ్లపల్లె : మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందించడం, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి నియోజక వర్గంలో చేసిన అభివృద్ది చూసి,,ఎప్పటికై నా పేదల అభివృద్ది వైఎస్సార్ సీపీకే సాధ్యమన్న నమ్మకంతోనే మేమంతా చేరుతున్నాం..మండలంలోని కుక్కరాజుపల్లికి చెందిన వై. రెడ్డెప్పరెడ్డి, ఎం.వెంకట్రమణ, బి. శంకర్, వాసు, జె.వెంకట్రమణ, బీఎస్‌ఆర్ వడ్డిపల్లికి చెందిన పెద్ద ఉత్తన్న, గంగరాజు, ఈ. హరి, కె. రామాంజులు, ఆదినారాయణ, మల్లిఖార్జున కుటుంబాలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో బుధవారం చేరారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వారిని పార్టీ కండువాలతో ఆహ్వానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని, అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు భార్గవ్ రెడ్డి, చాయాపతి రెడ్డి, శివశంకర్, రమేష్ రెడ్డి, రఘురామిరెడ్డి, షరీప్, రమణ, ఎర్రప్ప, పద్మనాభరెడ్డి, చంద్రశేఖర్, మల్లిఖార్జున, నరసింహనాయుడు తదితరులు పాల్గొన్నారు.


