వర్షం వస్తే మునిగిపోయే అమరావతిలో నీటిని తోడేందుకే చంద్రబాబు ప్రభుత్వం రూ. 400 కోట్లు ఖర్చు చేస్తోంది. అందులో సగం నిధులు కేటాయించినా మదనపల్లె మెడికల్ కాలేజీ పనులు పూర్తవుతాయి. పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందుతుంది. జగనన్న నిర్మించారనే కక్షతో పేద ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం దుర్మార్గం. రాయలసీమకు లక్ష కోట్ల అభివృద్ధి అని ప్రగల్భాలు పలికే చంద్రబాబు, మదనపల్లె మెడికల్ కాలేజీపై ఎందుకు కక్ష కట్టారో ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. – పీవీ.మిథున్‌రెడ్డి, రాజంపేట ఎంపీ


