కనెక్టివిటీకి ‘మార్గ’మేదీ ! | - | Sakshi
Sakshi News home page

కనెక్టివిటీకి ‘మార్గ’మేదీ !

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

కనెక్టివిటీకి ‘మార్గ’మేదీ ! ఒంటమిట్టకు హైవే నుంచి సర్వీసురోడ్డు ఇవ్వాలి సర్వీస్‌రోడ్డు లేకపోతే ఎలా

గ్రీన్‌హైవే నిర్మాణప్రక్రియలో

సర్వీస్‌ రోడ్లు లేకపోవడంపై

స్థానికుల్లో ఆందోళన

సర్వీస్‌ రోడ్లు నిర్మించాలని

భక్తులు, యాత్రికుల డిమాండ్‌

రాజంపేట: గ్రీన్‌ హైవే (కడప–రేణిగుంట నేషనల్‌ హై వే) నిర్మాణంలో సర్వీసు రోడ్డుకు మోక్షం కరువైంది.. శేషాచలం అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో పయ నించే గ్రీన్‌హైవే నుంచి మెయిన్‌ రోడ్డుపైకి రావడానికి ‘కనెక్టివిటీ’కి దారి లేకుండా పోతోంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రఖ్యాత ఒంటిమిట్ట, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడికి కూడా స ర్వీస్‌ రోడ్డు నిర్మించకపోవడంపై స్థానికుల్లో ఆందోళన కలుగుతోంది. కాగా రూ.4వేల కోట్ల వ్యయంతో రా యలసీమ జిల్లాలకు ముఖ్య రహదారిగా ప్రాచుర్యం పొందిన గ్రీన్‌హైవేని మరో రెండేళ్లలో పూర్తిగా అందుబాటులో తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.

గ్రీన్‌హైవే నుంచి సర్వీసురోడ్డు లేదంటా..

గ్రీన్‌హైవే నుంచి పుణ్యక్షేత్రాలైన నందలూరు, ఒంటిమిట్ట కేంద్రాలు సర్వీసురోడ్డు లేదని సమాచారం నిర్మాణ సంస్థల నుంచి తెలిసింది. గ్రీన్‌హైవే రోడ్‌ మ్యాప్‌లో సర్వీస్‌ రోడ్ల ప్రతిపాదన లేదని కాంట్రాక్ట్‌ సంస్ధలకు చెందిన ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. సర్వీసురోడ్డు నిర్మాణం చేయాలంటే కేంద్రం నుంచే ఆదేశాలు రావాలని చెబుతున్నట్లు సమాచారం.

రామయ్య వద్దకు వెళ్లేదేలా..

కడప–రేణిగుంట నేషనల్‌హైవేలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఒంటిమిట్ట, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. గ్రీన్‌ హైవే నుంచి సర్వీస్‌ రోడ్డు లేకపోతే ఈ ప్రముఖ ఆలయాలకు, ఆయా ప్రాంతాల కు వెళ్లేదెలా అంటూ యాత్రీకులు,భక్తులు, పర్యాటకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా మండల కేంద్రాలకు సంబంధంలేని ఏరియాలో సదూర ప్రాంతంలో కనెక్టటివి ఇవ్వడంవల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే భూసేకరణ చేసైనా సర్వీస్‌ రో డ్లు నిర్మించాలని భక్తులు, పర్యాటకులు కోరుతున్నారు.

కూటమి ఎంపీలు స్పందించాలిపుడే...

రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం చెందిన జిల్లాలోని పుణ్యక్షేత్రాలైన ఒంటిమిట్ట నందలూరు కేంద్రాలకు కడప–రేణిగుంట గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నుంచి కనెక్టిటివి రోడ్‌ (సర్వీసురోడ్డు) అవసరమని భక్తులు గట్టిగా వాదిస్తున్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న కూటమి ఎంపీలు స్పందించి కేంద్రపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రా మాలయం ఒంటిమిట్ట రా మాలయం. రాష్ట్రంలో నలు మూలల నుంచి భక్తులు, యాత్రీకులు రావాలంటే హై వే నుంచి సర్వీసు రోడ్డు ఇ వ్వడం తప్పనసరి. ఇప్పుడు నిర్మితంలో ఉన్న గ్రీన్‌హైవే నుంచి ఒంటిమిట్ట దగ్గరలో సర్వీసురోడ్డు ఇవ్వాలి. ఆదిశగా కేంద్రప్రభుత్వం అడుగులు వేయాలి. ఎంపీల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. – ఇరగంరెడ్డిసుబ్బారెడ్డి,

జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌, ఒంటిమిట్ట

గ్రీన్‌హైవే నుంచి పుణ్యక్షేత్రా లైన నందలూరుకు నేరుగా సర్వీసురోడ్డు నిర్మితం చేయాలి. ఇప్పటి వరకు ఆ ప్రతిపాదనలు లేవనే విషయం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడో అప్రోచ్‌రోడ్డు నిర్మితం చేయడం వల్ల ఉపయోగంలేదు.దక్షిణభారతీయులు నందలూరు సౌమ్యనాధునికి రావాలంటే నాగిరెడ్డిపల్లె శివార్లలో నేరుగా సర్వీసురోడ్డ్డు నిర్మితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది – భూమనశంక్‌రెడ్డి,

మాజీ సర్పంచి,నాగిరెడ్డిపల్లె, నందలూరు

Advertisement
 
Advertisement
Advertisement