ఈదురుగాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

లద్దిగం వద్ద టమాటా సాగు కోసం సిద్దం చేసిన పొలంలో నిలిచిన వర్షపునీరు

చింతమాకులపల్లె వద్ద నేలరాలిన

మామిడి కాయలు

చౌడేపల్లి: మండలంలో బుధవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.గాలుల ధాటికి మామిడికాయలు నేల రాలాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టమాటా పంటలో వర్షం నీరు చేరింది. అకాల వర్షంతో వరి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది.దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement