న్యాయవాది హత్యపై నిరసన | - | Sakshi
Sakshi News home page

న్యాయవాది హత్యపై నిరసన

Apr 8 2026 7:20 AM | Updated on Apr 8 2026 7:20 AM

వాల్మీకిపురం : పీలేరు నియోజకవర్గంలో న్యాయవాది యల్లయ్య హత్యకు గురి కావడం అత్యంత దారుణమైన సంఘటన అని వాల్మీకిపురం జూనియర్‌ సివిల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రవిప్రకాష్‌ అన్నారు. మంగళవారం స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల పై దాడులను ప్రభుత్వం అరికట్టాలన్నారు. రో జు రోజుకు ఎక్కడో ఒక చోట న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు విభాకర్‌రెడ్డి, రమణ, ఆర్‌వీ ప్రసాద్‌, అశోక్‌ కుమార్‌రెడ్డి, రమణారెడ్డి, ద్వారకనాథరెడ్డి, ఆనంద కుమార్‌, మహిత, కరీముల్లా బేగ్‌, సదాశివరెడ్డి, పాల్గొన్నారు.

నిందితులకు కఠినంగా శిక్షించాలి

పీలేరు రూరల్‌ : ప్రాక్టీస్‌ న్యాయవాది పూజారి యల్లయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బి.సి.పురుషోత్తంరెడ్డి, ఆర్‌. చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం స్థానిక కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూజారి యల్లయ్య గత ఐదు సంవత్సరాలుగా పీలేరులో ప్రాక్టీస్‌ న్యాయవాదిగా పని చేస్తూ జీవనం సాగించేవాడని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వారి స్వగ్రామం పాతవడ్డిపల్లెలో దారుణ హత్యకు గురి కావడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎం. మదన్‌మోహన్‌రెడ్డి, వి.చిన్నరెడ్డెప్ప, శ్రీకాంత్‌, శేషాద్రి, పి.నిరంజన్‌, ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌. నిరంజన్‌ తదితరులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement