కార్యకర్తలకే రాజ్యాధికారం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకే రాజ్యాధికారం

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 6:50 AM

కార్య

కార్యకర్తలకే రాజ్యాధికారం

పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలో జరిగిన సభకు హాజరైనవారు ప్రసంగిస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి, చిత్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమరనాథ్‌రెడ్డి

పుంగనూరు: జగనన్న సూచనతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొత్త పరిస్థితులు నెలకొంటున్నాయని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక రాజ్యాధికారం కార్యకర్తలకే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. సదుం మండలం యర్రాతివారిపల్లెలో తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల కమిటీ సభ్యుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సభలో ఎంపీ మాట్లాడుతూ కార్యకర్తగా గుర్తింపు, కమిటీ పదవులు కలిగిన వారికి అధికారిక పదవులు దక్కుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. కార్యకర్తలకే జగనన్న అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కడప, రాజంపేట నియోజకవర్గాలలో బలంగా ఉన్నామని, ఈసారి అన్ని సీట్లనూ గెలుస్తామన్నారు. ఒక నియోజకవర్గానికి 8వేల మంది కార్యకర్తలను ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కొక్క రు రెండు ఓట్లు వేయించినా 110 సీట్లతో అధికారంలోకి వస్తామన్నారు. అధికారంలో ఉంటేనే అందరు సెల్యూట్‌ చేస్తారని గుర్తు చేశారు. జగనన్న సైన్యాన్ని కూటమి మూడు పార్టీలు కాదు, మరో నాలుగు పార్టీ లు వచ్చినా ఎదుర్కోలేవని ధీమా వ్యక్తం చేశారు. గెలుపోటములకు అతీతంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు బలంగా ఉన్నాయని, అయితే తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేయడం, ఆస్తినష్టం కలిగించడం తన మనసును కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకుంటున్నామని, కార్యకర్తల అభిమానం వల్లే తాము ఈ స్థాయికి వచ్చమన్నారు. పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వారికి ఇన్సూరెన్స్‌ కూడా అందిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఖాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి మాట్లాడుతూ కమిటీల ఏర్పాటుతో ప్రతి గ్రామంలోను జగనన్న సైన్యం సిద్ధమవుతోందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, పార్టీ సీనియర్‌ నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, మదనపల్లె మున్సిపల్‌ చైర్మన్‌ మనూజరెడ్డి, వైస్‌ చైర్మన్‌ జింకా వెంకటాచలపతి, సమన్వయకర్త నిస్సార్‌ అహమ్మద్‌, పరిశీలకులు సుబ్బారెడ్డి, పార్టీ ఎస్‌ఈసీ మెంబర్‌ ఉదయ్‌కుమార్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాబ్‌జాన్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి, ఫృధ్వీధర్‌రెడ్డి, ఉమ్మడిజిల్లాల ఐటీ వింగ్‌ ఇన్‌చార్జ్‌ ప్రకాష్‌రెడ్డి, ఎంపీపీ సురేంద్రరెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్‌రెడ్డితో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు.

కడప, రాజంపేటల్లో కాదు రాష్ట్రమంతా గెలవాలి

2029లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం

మూడు నియోజకవర్గాల కమిటీలసమావేశంలో ఎంపీ మిధున్‌రెడ్డి

కార్యకర్తలకే రాజ్యాధికారం 1
1/1

కార్యకర్తలకే రాజ్యాధికారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement