విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై విచారణ
బి.కొత్తకోట : మండలంలోని శంకరాపురం జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం సీఐ గోపాల్‌రెడ్డి, ఎంఈవో రెడ్డిశేఖర్ విచారణ చేశారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని జానకిరాణి గురువారం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితిలో ఉన్న ఆ విద్యార్థినిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. దీనిపై హైస్కూల్‌కు వచ్చిన సీఐ, ఎంఈవోలు హెచ్‌ఎం మునిస్వామి, టీచర్లు, విద్యార్థులను విచారణ చేశారు. విద్యార్థినిని తిట్టలేదని హెచ్‌ఎం, టీచర్లు చెప్పారు. దీనికి కొన్ని రోజులుగా జరిగిన కొన్ని ఘటనలు వారి దృష్టికి వచ్చాయి. అనంతరం పలువురి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. తిరుపతి ఎంఈవో ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న జానకిరాణిని విచారణ చేశారు. విచారణలో హెచ్‌ఎం తనను తిట్టినందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు చెబుతోంది. దీనిపై ఇంకా విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.


