వైఎస్సార్‌సీపీ జీసీసీ కో– కన్వీనర్‌గా గోవిందు నాగరాజు
రాజంపేట: వైఎస్సార్‌సీపీ జీసీసీ (గల్ఫ్ కౌన్సిల్ ఆఫ్ కంట్రీస్ ) కో–కన్వీనర్‌గా రైల్వేకోడూరు నియోజకవర్గ పెనగలూరు మండలం చక్రంపేటకు చెందిన గోవిందనాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి.
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ గల్ఫ్ కన్వీనర్‌గా బీహెచ్ ఇలియాస్‌ను మళ్లీ నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ తాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి మరోసారి గల్ఫ్ కన్వీనర్‌గా నియమించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ కమిటీలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా, అంకిత భావంతో కృషి చేసి పార్టీ అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. 2015 నుంచి గల్ఫ్ కన్వీనర్‌గా పనిచేయడంలో సహకరిస్తున్న కువైట్, ఖతార్, యూఏఈ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
రాయచోటి: స్క్రబ్‌టైఫస్ వ్యాధిపై ఆందోళన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మీనరసయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్క్రబ్‌టైఫస్‌పై జరుగుతున్న ప్రచారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్పందించారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పరిధిలో ఇప్పటికి 289 నమూనాలను సేకరించగా 39 మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ వ్యాధి తీవ్రమైంది కాదని ఇందుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందన్నారు. అధిక జ్వరం, అధిక నొప్పులు ఉంటే సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లి సకాలంలో చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందన్నారు. వైద్య సిబ్బంది ప్రతి గ్రామంలో పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించామని అందులో పేర్కొన్నారు.
చింతకొమ్మదిన్నె: తుఫాను, వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గురువారంబుగ్గవంక ప్రాజెక్ట్ నుంచి ఒక గేటు ద్వారా 150 క్యూసె క్కుల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 185.2మీటర్ల వద్ద నీటి నిల్వ ఉందని తెలిపారు.
కడప కార్పొరేషన్: కడప నగరపాలక మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 7లోపు కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎక్స్ అఫిషియోసభ్యులకు సమచారం ఇవ్వాలని, 11వ తేది ప్రత్యేక సమావేశం నిర్వహించి మేయర్ ఎన్నిక నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. ఈ ఎన్నికకు దారితీసిన పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే...
● కడప ఎమ్మెల్యేగా ఎన్నికై న తనకు మేయర్‌తో సమానంగా వేదికపై కుర్చీ వేయలేదన్న ఏకై క కారణంతోనే ఈ ఎన్నిక వచ్చినట్లు అవగతమవుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి ఆడిన కుర్చీ ఆట వల్లే మూడు నెలల్లో పాలకవర్గం పదవీ కాలం ముగిసిపోతున్న తరుణంలో మేయర్ ఎన్నిక అనివార్యమైనట్లు తెలుస్తోంది. తనకు వేదికపై కుర్చీ వేయని వేయని వ్యక్తి మేయర్ స్థానంలో ఉండకూడదని...జీహెచ్‌ఎంసీ యాక్టులో ఉన్న ఒక నిబంధనను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే మాధవి స్వయంగా ఫిర్యాదు చేసి మేయర్‌గా ఉన్న కె. సురేష్ బాబుపై అనర్హత వేటు వేయించారు. సురేష్‌బాబుకు అనర్హత ఉత్తర్వులు అందకముందే డిప్యూటీ మేయర్‌గా ఉన్న ముంతాజ్‌బేగంను ఇన్‌చార్జి మేయర్‌గా నియమించారు. మేయర్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించడం..ముంతాజ్‌బేగం ఓసీ కావడంతో మేయర్ ఎన్నిక అనివార్యమైనట్లు తెలుస్తోంది.
వైఎస్సార్‌సీపీ జీసీసీ కో– కన్వీనర్‌గా గోవిందు నాగరాజు
వైఎస్సార్‌సీపీ జీసీసీ కో– కన్వీనర్‌గా గోవిందు నాగరాజు


