వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో గురువారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 10 గంటలకు సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కళ్యాణం వైభవంగా నిర్వహించారు.
వర్షం కురుస్తుండటంతో ఆలయ రంగమండపంలోనే ప్రత్యేక కల్యాణ వేదిక ఏర్పాటు చేసి, అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్ ఉత్సవ మూర్తులను వేర్వేరుగా కొలువుదీర్చారు. అనంతరం సీతారాములకు సుగంధద్రవ్యాలతో పాటు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరినీళ్లతో అభిషేకాలు నిర్వహించి, నూతన పట్టువస్త్రాలు ధరింపజేసి, తులసి గజమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.


