రాజంపేట డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలి: కలెక్టర్
రాజంపేట: రాజంపేట డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం రాజంపేటరూరల్ పరిధిలోని బోయనపల్లెలోని సీఎల్‌ఆర్పీ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అఽభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు డీడీఓ కార్యాలయం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కాగా అంతకుముందు డీడీఓల ప్రారంభోత్సవం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ ద్వారా నిర్వహించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ భావన, తహసీల్దారు పీరుమున్నీ, జనసేన పార్లమెంటరీ నియోజకవర్గ నేత యల్లటూరు శ్రీనివాసరాజు, టీడీపీ ఇన్‌చార్చి జగన్‌మోహన్‌రాజు, డీడీఓ నరసింహమూర్తి పాల్గొన్నారు.
కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు
పలువురు తమ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలను అందచేశారు. అందులో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని, ఆదిశగా నివేదికను ప్రభుత్వానికి పంపాలని వినతిపత్రం అందచేశారు.


